Site icon Swatantra Tv

ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దెదించడమే నా ఎజెండా: పొంగులేటి

ex-MP Ponguleti Srinivas Reddy| టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ బృతి హామీ ఇచ్చారు కానీ ఒక్క రూపాయ నిరుద్యోగ బృతి ఇవ్వలేదన్నారు. ఎన్నికలు వస్తేనే నిరుద్యోగులు గుర్తుకు వస్తారా? అంటూ మండిపడ్డారు. పరీకలు రద్దు చేసి విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ రెండు నెలల్లో పరీక్షలు ఏర్పాటు చేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నీటి పారుదలకు సంబంధించి ప్రాజెక్టులు, నిదులు, నియమాకాలల్లో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రముఖ పుణ్యక్షేతం భద్రాచలం దేవాలయ అభివృద్దికి నోచుకోలేదని అన్నారు. నిదులు, నీళ్లు, నియమాకాలు అన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయని… ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జెండా ఏది అయిన ఎజెండా ఒక్కటేనని.. అది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దెదించడమేనని వ్యాఖ్యానించారు.

Exit mobile version