Site icon Swatantra Tv

రాహుల్ గాంధీపై ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజల మీద విశ్వాసం లేని వ్యక్తి రాహుల్ అని ఫైర్ అయ్యారు. ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో విదేశాలకు వెళ్లి భారత జాతీ ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి దేశం పట్ల ఎలాంటి వైఖరి ఉందో వారి మాటల్ని పట్టి అర్థమవుతుందన్నారు. ఎల్బీనగర్‌ రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయం ముందు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. దీనికి ఈటలతో పాటు మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్‌ పాల్గొన్నారు.

Exit mobile version