Site icon Swatantra Tv

అజ్ఞాతంలో మోహన్ బాబు?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక దాని వెనక మరొక సంఘటలు చోటు చేసుకుంటున్నాయి. జల్పల్లిలో జరిగిన ఘటనపై పోలీసులు విచారణకు రావాలని మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా తాను విచారణకు రాలేనని తెలిపిన మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ మోహన్ బాబు పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. మరోవైపు విచారణకు రాలేనని తెలపడంతో ఆ విచారణను రాచకొండ పోలీసులు డిసెంబర్ 24కు వాయిదా వేశారు.

నిన్న కూడా మోహన్ బాబు విచారణకు రాకపోవడంతో పోలీసులు ఈ విషయంపై సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు నోటీసులు పంపించినా హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఆయనకు మళ్ళీ నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు అంటూ పహాడీ షరీఫ్ పోలీసులు కూడా గాలింపు చేపట్టారు.

Exit mobile version