Site icon Swatantra Tv

ఢిల్లీ రాష్ట్రపతిపాలనకు మోదీ సర్కార్ యోచన ?

  ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందా. ఆమ్ ఆద్మీపార్టీ తో పాటు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రకమైన సూచనలు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకూ రాష్ట్రపతి పాలన విధించకుండా ఆగుతారా. . ఈ లోగానే వేటు వేస్తారా అన్నది సస్పెన్స్.

   ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నాటి నుంచి ఢిల్లీలో రాజకీయ అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వానికి ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉంది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత .. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. రోజువారీ కార్యకలాపాలు సాగుతున్నా, కీలక ప్రభుత్వ కార్యకలాపాలు మందగించాయి. ఢిల్లీ మంత్రులు .. పాలన కన్నా.. కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసన కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్యకర్తలతో మంతనాలు, ధర్నాలు, ప్రదర్శనల ఏర్పాటు పైనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి.. సీఎం కూ… లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు ఏనాడు సామరస్య పూర్వక సంబంధాలు లేనే లేవు. లెఫ్టినెంట్ గవర్నర్.. కేంద్రం ఏజెంట్ గానో, కేంద్రహోం మంత్రి అమిత్ షా పీయే గానో వ్యవహరిస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ జైలులో ఉంటే.. లెఫ్టినెంట్ ప్రభుత్వాన్ని నడిపేందుకు పెద్ద చొరవ చూపలేదు. కానీ తాను సమావేశం ఏర్పాటు చేసినా ఢిల్లీ మంత్రులు రావడంలేదని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.

    ఢిల్లీలో వివిధ శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నా.. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి వాటిని భర్తి చేసేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు. కేంద్ర హోం శాఖ నియమించిన ఐఏఎస్ అధికారులు కూడా హోంమంత్రి ఆదేశాలు, ఆలోచనలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిం చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. కొద్ది రోజులుగా కేంద్రం నుంచి ఇదే విధమైన సూచనలు వ్యక్తమవు తున్నాయని అతిషి ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం పెద్దగా వ్యవహరించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ హోం శాఖకు పలు ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాస్తున్నారని అతిషి ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిని 20 ఏళ్లనాటి కేసు సాకుగా చూపి తొలగిం చారని ఆమె విమర్శించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ… పక్కలో బల్లెంగా ఉందన్నది బీజేపీ నిశ్చితాభిప్రాయం. ఆ పార్టీ ఎదుగుతూ. పంజాబ్ లో ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడం కూడా కంటకం గానే ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ కేసు సాకుతో.. కేంద్ర ఏజెన్సీల ద్వారా కేజ్రీవాల్ ను జైలుకు పంపినా.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ సర్కార్ రాష్ట్ర పతి పాలన విధించేందుకు కాస్త ముందు వెనుకలు ఆడుతున్నట్లు కన్పి స్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత.. కేజ్రీవాల్ సర్కార్ పై వేటు ఖాయమే.

Exit mobile version