Site icon Swatantra Tv

MLC Kavitha |సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణ మరింత ఆలస్యం..

MLC Kavitha

MLC Kavitha |మహిళను ఇంటివద్ద కాకుండా ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ తన కార్యాలయానికి పిలిచి విచారించడంతో పాటు.. రాత్రి 8గంటలు దాటిన తర్వాత కూడా విచారణ చేయడాన్ని సవాలు చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 27వ తేదీన విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈనెల 24వ తేదీన విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. అయితే కవిత పిటిషన్‌ విచారణ ఈనెల27వ తేదీ జాబితాలో ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈనెల 14వ తేదీన సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయగా.. ఈనెల 15వ తేదీన తన వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని కవిత తరపున న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. వీలైనంత త్వరగా విచారణ జరపాలని కోరారు. అయితే ఈనెల 24వ తేదీన విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. కాని ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కవిత పిటిషన్‌పై ఈనెల 27వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత(MLC Kavitha) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి సీబీఐ అధికారులు కవితను హైదరాబాద్‌లోని తన ఇంట్లో విచారించగా.. మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మూడుసార్లు కవితను విచారించారు. తన విచారణ సందర్భంగా ఈడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని, మహిళలకు ఉండే హక్కులను తనకు కల్పించలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 Read Also:  పోలవరం అంటే వైఎస్సార్‌.. పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే: సీఎం జగన్

Follow us on:   Youtube   Instagram

Exit mobile version