Site icon Swatantra Tv

నేడు హైకోర్టులో కీలక విచారణ

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఉత్కంఠ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక విచారణ చేపట్టనుంది. నలుగురు టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నది తెలంగాణ పోలీసు విభాగం ఆరోపణ. దీని మీద రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఏర్పాటైన సిట్ దూకుడుగా దర్యాప్తు చేపట్టింది. బీజేపీ సంఘటన కార్యదర్శి బీ ఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చేదాకా మ్యాటర్ వెళ్లింది. ఈ లోగా సిట్ దర్యాప్తు కి హైకోర్టు సింగిల్ జడ్జి బ్రేకులు వేశారు. కేసు దర్యాప్తును సీబీఐ కు అప్పగించారు. డివిజన్ బెంచ్ కూడా ఇదే అభిప్రాయాన్ని బలపరిచింది.

దీని మీద తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటీషన్ దాఖలు చేసింది. సిట్ దర్యాప్తుని అడ్డుకోవటం సరికాదని ఇప్పటికే ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీని మీద ప్రతివాదుల వాదనలు ఈ రోజు హైకోర్టు వినబోతోంది. 2014 నుంచి పెద్ద ఎత్తున టీ ఆర్ ఎస్ లో ఎమ్మెల్యేల చేరికను ప్రతివాదులు ప్రస్తావిస్తున్నారు. దీంతో ఈ కేసు తీర్పుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కబోతున్నాయి.

Exit mobile version