Site icon Swatantra Tv

హిందూపురంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.90 కోట్లు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. హిందూపురం అంటే చంద్రబాబుకు ఎనలేని అభిమానమన్న బాలయ్య…. అందుకే పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లాకు సత్యసాయి పేరు అలానే ఉంచి.. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని బాలకృష్ణ తెలిపారు. సత్య సాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న క్యాంటీన్లను రెండు చోట్ల ప్రారంభించారు. స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు.

Exit mobile version