Site icon Swatantra Tv

భారత్ లో మిస్ వరల్డ్ 2024 పోటీలు

     71వ మిస్ వరల్డ్ 2024 పోటీలు భారత్ వేదికగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ పోటీలు నేటితో ముగియనున్నాయి. ముంబాయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ పోటీలు జరగను న్నాయి. మిస్ వరల్డ్ 2024 కాంపిటీషన్స్‌లో 120 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటున్నారు. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీలు చివరి దశకు వచ్చేశాయి. మరి కొన్ని గంటల్లో మిస్ వరల్డ్ 2024 విజేత ఎవరో తేలనుంది. భారతదేశం నుంచి ఫెమినా మిస్ ఇండియా సినీ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తుంది.

      గ్లోబల్‌ ఫైనల్‌, ఫాస్ట్‌ ట్రాక్‌ ఈవెంట్స్‌ పేరిట వడబోత జరుగుతుంది. వందలాది మహిళలు పోటీ పడగా సుమారు 20 మందిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. అనంతరం, ‘బీచ్‌ బ్యూటీ’, ‘మిస్‌ టాలెంట్‌’, ‘మిస్‌ స్పోర్ట్‌’, ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ వంటి యాక్టివిటీస్‌ నిర్వహించి… వారిలో ప్రతిభ కనబరి చిన వారిని ఫైనల్‌ రౌండ్‌కు తీసుకుంటారు. అన్ని రౌండ్లలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.

    భారత్‌ నుంచి ఆరుగురు అందాల భామలు కిరీటాన్ని అందుకున్నారు. రీటా ఫరియా, ఐశ్వర్యా రాయ్‌, డయానా హెడెన్‌, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్‌ ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. అత్యధిక కిరీటాలు గెలిచిన దేశాల జాబితాలో భారత్‌తోపాటు వెనిజులా ఉంది. తాజా పోటీల్లో 112 మంది పాల్గొన్నారు. మిస్‌ ఇండియా వరల్డ్‌- 2022 సిని శెట్టి భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పోటీలకు 1996లో భారత్‌ ఆతిథ్యమిచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ పోటీల్లో వెనిజులాకు చెందిన ఇరెన్‌ స్క్లివా ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. ఆ ఏడాది నుంచే ఇంటర్నెట్‌ కవరేజ్‌ను తీసుకొచ్చారు.

Exit mobile version