Site icon Swatantra Tv

వైసీపికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఛాంద్ బాషా

Chand Basha

Chand Basha |బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు సమక్షంలో మైనార్టీ సంఘం రాష్ట్ర నాయకుడు షేక్ ఛాంద్ బాషా కాషాయ కండువా కప్పుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయానికి నేరుగా వచ్చి పార్టీ తీర్ధం తీసుకున్నారు షేక్ ఛాంద్ బాషా. గుంటూరులో మున్సిపల్ కౌన్సిలర్ గా కార్పోరేటర్ గా పనిచేసిన ఛాంద్ బాషా కాంగ్రెస్ లో పిసిసి కార్యదర్శిగా, మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అనంతరం వైసీపిలొ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వైసీపికి రాజీనామా చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా షేక్ ఛాంద్ బాషా మాట్లాడుతూ… బీజేపీ ముస్లింలకు రక్షణ కల్పించడమే కాదు, సంక్షేమం అమలు చేస్తోందన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పాలనపట్ల ఆకర్షితులయ్యానన్నారు. సోమువీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి చందుసాంబశివరావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ తోట రామక్రుష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, కన్నారవిదేవరాజు, ఎం మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Follow us on:   Youtube   Instagram

Exit mobile version