Site icon Swatantra Tv

రైతు ఆత్మహత్య ఘటనపై మంత్రి తుమ్మల ఆరా

   రైతు ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆరా తీశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దు టూరు గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై మంత్రి తుమ్మల స్పందించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల ని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ప్రభుత్వానికి అందజేయా లని రెవిన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. రైతులు పొలం పంచాయితీల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పొలం పంచాయితీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. కాంగ్రెస్ పాలన లో రైతులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు తుమ్మల.

Exit mobile version