Site icon Swatantra Tv

బడి పంతులమ్మ గా మారిన మంత్రి సీతక్క

మంత్రి సీతక్క స్కూల్ టీచర్ గా అవతారం ఎత్తారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ములుగు జిల్లాలో తొలి కంటైనర్ స్కూల్ ను ప్రారంభించారు మంత్రి సీతక్క. కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామంలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ స్కూల్ ను సీతక్కప్రారంభించారు. అనంతరం ఐదు నిమిషాలు ఇంగ్లీష్ పంతులమ్మగా మారి తరగతి గదిలో పాఠాలు బోధించారు. సరదాగా విద్యార్థులతో ముచ్చటించారు మంత్రి సీతక్క.

అట‌వి ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటు చేశారు మంత్రి సీతక్క. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్ద‌రు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా..వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్య‌వంతంగా కూర్చునే విధంగా కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ను అందుబాటులోకి తెచ్చారు.

Exit mobile version