Site icon Swatantra Tv

బీసీ సంక్షేమశాఖపై మంత్రి పొన్నం సమీక్ష

బీసీ సంక్షేమశాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో జిల్లా స్థాయి అధికారులు, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు, గురుకులాల్లో మంచి ఫలితాలు, వాటి పరిశుభ్రత, వసతి సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Exit mobile version