చెరువుల పరిరక్షణకు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చెరువులు ఆక్రమణల పై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. హైదరాబాద్ తరువాత అన్ని జిల్లాల్లో ఆక్రమణకు గురయిన చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైడ్రా కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్శిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే న్యాయ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.