Site icon Swatantra Tv

విట్ వర్సిటీలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

ఐటీ రంగం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని అన్నారు మంత్రి లోకేష్. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శన కార్యక్రమంలో.. మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. ఉన్నత విద్య కోసం తాను కూడా విదేశాలకు వెళ్లి వచ్చానని మంత్రి లోకేశ్‌ తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువాళ్లు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. మనకు, విదేశాల్లో ఉన్నత విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. విదేశాల్లో పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరని చెప్పారు. వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని… ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్‌ ఎదిగేందుకు అవకాశం ఉందని లోకేశ్‌ తెలిపారు.

Exit mobile version