Minister Jagadish Reddy |తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు మళ్లీ జారీ చేయడమే అందుకు నిదర్శనం. అరెస్ట్ చేస్తారనే ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) స్పందించారు. ఇది ప్రధాని మోదీ నిరంకుశ, దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కవితను అరెస్ట్ చేయడమంటే…మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడినట్టేనని అన్నారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతోందనే సంగతి ప్రజలందరికీ తెలుసునని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలను అణచివేయాలనే ధోరణితోనే మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు జైళ్లు, కేసులు కొత్త కావని తెలిపారు. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల్లో తేలుస్తామని, ప్రజల మధ్యకే వెళతామని పేర్కొన్నారు.