Viral News | సోషల్ మీడియా వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలో.. ఎక్కడ ఏం జరిగినా వెంటనే వైరల్ అవుతోంది. ఏవైనా పంక్షన్స్ జరిగేటప్పుడు అంతా ఒకే చోట కలిసిన వేళ డ్యాన్సులు చేయడం, ఆట, పాటలతో కలిసి చిందులేయడం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో మాత్రం వెరైటీ కోసం చేసే పనులు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఓ స్నేహితుడి పెళ్లి వేడుకలో అబ్బాయిలు చీరలు ధరించి డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన వేషధారణలు చాలా సందర్భాల్లో అనేకమందిని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి ఘటనలు ఏవైనా వేడుకల్లో ఎంతో సరదానివ్వడంతో పాటు.. మంచి ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని అందిస్తాయి. దీనిలో భాగంగా తమ స్నేహితుల పెళ్లిలో కలిసిన ఫ్రెండ్స్ అంతా చీరలు ధరించి స్టెప్పులేశారు.
Viral News |వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియోలో, అబ్బాయిలు తమ సాంప్రదాయ దుస్తులపై చీరను ధరించారు. దోస్తానా సినిమాలోని ప్రియాంక చోప్రా పాటపై తమ తుమ్కాలతో డ్యాన్స్ ఫ్లోర్‌లో డ్యాన్సుతో దుమ్మురేపారు. అబ్బాయిలు డ్యాన్స్ చేస్తుండగా.. ఇద్దరు మహిళలు వచ్చి వారితో చేరి నృత్యంతో ఇరగదీశారు. ఈ పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని రోజుల్లోనే వేలాది మంది వీక్షించడంతో పాటు.. వందలాది మంది లైక్ చేశారు. అలాగే నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.