Site icon Swatantra Tv

గోకుల్ నగర్‌లో పెళ్లి కుమారుడు మిస్సింగ్

        ఈనెల 16న పెళ్లి. వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే పెళ్లి కుమారుడు మిస్సింగ్. దాంతో అటు అబ్బాయి, ఇటు అమ్మాయి తరపు బంధువులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన హనుమకొండ గోకుల్ నగర్‌లో చోటుచేసుకుంది. హనుమకొండ టౌన్ గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణతేజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. నర్సంపేటకు చెందిన యువతితో అతడికి పెళ్లి కుదిరింది. ఈనెల 16న పెళ్లి ముహూర్తం ఖరారు చేయగా.. ఇరు కుటుంబాలకు చెందినవారు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. ఇంతలోనే వరుడు కృష్ణతేజ్ కనిపించకుండా పోయాడు. పెళ్లి ఆహ్వాన పత్రికలను బంధువులు పంచేందుకు వెళ్లిన కృష్ణతేజ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. SRSP కెనాల్ పక్కన అతడి బైక్‌ను బంధువులు గుర్తించారు. మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కృష్ణతేజ్ కనిపించకుండా పోవటంతో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరపుతున్నారు.

Exit mobile version