Site icon Swatantra Tv

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. పీఎం ఆవాస్‌ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29ను ఆమోదించింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు కేబినెట్‌ ఆమోదం లభించింది.

ఏపీ ఆయుర్వేద, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. డిసెంబర్ 15 న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినం నిర్వహించేందుకు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీ 4.0 కి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు ఆమోదం లభించింది. ఏపీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Exit mobile version