Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సీఎం కేజ్రీవాల్(Kejriwal) ఆమోదించారు. మరోవైపు ఇటీవల జైలు నుంచి విడుదలైన మరో మంత్రి సత్యేంద్ర జైన్(Satyendar Jain) కూడా మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తూ ఆయన సంతకం చేశారు. అయితే ఆయన రాజీనామాకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తన అరెస్టుకు వ్యతిరేకంగా సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన CJI చంద్రచూడ్ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
Delhi Liquor Case |ఇద్దరు మంత్రుల రాజీనామా.. సీఎం ఆమోదం
