Site icon Swatantra Tv

మణిపూర్ ఘటన.. నిందితుడి ఇంటికి నిప్పు

స్వతంత్ర వెబ్ డెస్క్: రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుతుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపలులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు హురైన్ ఇంటికి నిప్పు పెట్టారు.

మహిళల్ని ఊరేగించిన అమానవీయ ఘటన మ‌ణిపూర్‌లోని కంగ్‌పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన జ‌రిగింది. అయితే బుధ‌వారం ఆ వీడియో మ‌రోసారి వైర‌ల్ అయ్యింది. ఆ వీడియోపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. నిందితుల‌కు మ‌ర‌ణ‌దండ‌న ఉంటుంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు రిజిస్ట‌ర్ చేశారు. కిడ్నాప్‌, గ్యాంగ్‌రేప్‌, మ‌ర్డ‌ర్ కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ప్రధాన నిందితుడు హురైన్ హెరదాస్ సింగ్ (32) అరెస్ట్ చేయగా, సాయంత్రం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version