Site icon Swatantra Tv

మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్

అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. హర్ష కుమార్‌కు ఆయన కులంలోనే విలువ లేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతున్న హర్షకుమార్‌… తన రాజకీయ అవసరాల కోసమే కులాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేసిన టీడీపీలోకి హర్ష కుమార్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కొంత మంది స్వార్థ పరులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా 90 శాతం మంది మాలలు ఎమ్మార్పీఎస్‌కు మద్ధతు ఇచ్చారని మందకృష్ణ చెప్పారు.

Exit mobile version