Site icon Swatantra Tv

మందకృష్ణ మాదిగ ఆగ్రహం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గత ముఖ్యమంత్రులు మొదట అంబేద్కర్‌కు నివాళులర్పించిన తర్వాతే కార్యక్రమాల్లో పాల్గొనే వారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ సీఎం మధ్యాహ్నం వరకు అంబేద్కర్‌కు నివాళులర్పించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌ ఇప్పుడు ఆయనకు ఏమైందని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కేవలం మాలల పక్షపాతిక వహిస్తూ మూడు పార్లమెంట్‌ సీట్లు, ఒక అసెంబ్లీ సీటు కేటాయించిన ఘనత రేవంత్‌ రెడ్డిది అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదిగ పల్లెలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు వస్తే ఎక్కడికక్కడ అడ్డగిస్తామని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎస్సీలకు మూడు స్థానాలు ఉంటే రెండు స్థానాలు మాదిగలకు కేటాయించి తమకు న్యాయం చేసిందన్నారు.

 

Exit mobile version