Site icon Swatantra Tv

అచ్యుతాపురం ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం- డిప్యూటీ సీఎం పవన్

అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పానన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్‌ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.

Exit mobile version