Site icon Swatantra Tv

రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు దుర్మరణం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా కైపమంగళం వద్ద ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సుధి తలకు తీవ్ర గాయాలు కావడంతో కొడుంగల్లూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ అయిన సుధి.. కొట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనదన్ మరప్పప్ప సహా పలు సినిమాల్లో నటించాడు. ఆయన మరణ వార్తతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. సుధి మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు.

Exit mobile version