స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్ చేస్తూ యంగ్ హీరోల కంటే ఫిట్‌గా ఉంటున్నాడు. తాజాగా ‘బీటీఎస్’ అంటూ తన ఫోటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. జీరో ఫ్యాట్ లుక్‌తో ఈ ఫొటోల్లో అదరగొడుతున్నాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మా ప్రిన్స్ ఎప్పటికీ అందగాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్
