Site icon Swatantra Tv

మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న ‘మా శంకరన్న’

సమాజంలో వివిధ కుటుంబాల్లో జరుగుతున్న అనుమానాస్పద సమస్యలను, మంచి చెడులను ఎత్తి చూపిస్తూ వాటిని ఎలా అరికట్టాలనే దానిపై చిత్రీకరిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ‘మా శంకరన్న ’. భళా క్రియేషన్స్ పతాకంపై హీరో, హీరోయిన్స్‌గా, కృష్ణ, శివ శర్వాణి, జబర్దస్త్ ఫణి, షేకింగ్ శేషు, సై సూర్య, కె. స్వాతి, శివ, జోష్న, రాజ్ గోపాల్, రామ్‌జీ రాథోడ్, బుచ్చి రెడ్డి, పవన్ కృష్ణ, కె. శంకర్ నాయక్, సిద్ధార్థ, మహేష్ నాయుడు, రమ్య, రిషిత, ఐవిఎస్ రావు నటీనటులుగా దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ ముప్పలను పరిచయం చేస్తూ ప్రసాద్ రాజు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఈ చిత్రంలోని మూడు పాటలు, ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్, అడ్వకేట్ పి. నారాయణ, నటుడు బోస్ బాబు, తదితరులు పాల్గొని మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుతూ చిత్ర యూనిట్‌కు సన్మానం చేశారు.

Exit mobile version