కిడ్నీ సంబంధిత సమస్య నుంచి కోలుకుంటున్న తమిళ నటుడు పొన్నంబాలం(Ponnambalam) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్లే తన కిడ్నీలు పాడయ్యాయనే వార్తలపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన తమ్ముడి వల్లే కిడ్నీలు పాడైపోయాయని షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన తండ్రికి నలుగురు భార్యలని.. అందులో మూడవ భార్య కొడుకుని సొంత తమ్ముడిగా భావించిన మేనేజర్ గా పెట్టుకున్నానని తెలిపారు. తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు తనే చూసుకునేవాడన్నారు. అయితే ఒకసారి తాను తాగే బీరులో స్లో పాయిజన్ కలిపాడని.. అంతేకాకుండా కొన్నిసార్లు తినే ఆహారంలో కూడా విషం కలిపేవాడని పేర్కొన్నాడు. దీంతో తన కిడ్నీలు పాడైపోయాయని.. వైద్యులను సంప్రదిస్తే విషప్రయోగం వల్లే ఇలా జరిగిందని చెప్పారన్నారు.
కాగా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న తనకు చికిత్స కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని సమయంలో చిరంజీవి గారు గుర్తుకు వచ్చారని పొన్నంబలం(Ponnambalam) తెలిపాడు. ఆయనకు ఫోన్ చేసి తన సమస్య గురించి చెప్పి సాయం చేయమని అడిగానన్నారు. లక్ష, రెండు లక్షలు హెల్ప్ చేస్తారని అనుకున్నానని.. కానీ మరో ఐదు నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలో జాయిన్ అవ్వమన్నారని తెలిపారు. ఆ హాస్పిటల్‌లో ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదని.. మొత్తం బిల్లు 40లక్షలు అయిందని.. చిరంజీవి గారే అంతా చూసుకున్నారని పొన్నంబలం వెల్లడించాడు.
Read Also: రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం.. చెర్రీని సన్మానించనున్న ప్రధాని మోదీ
Follow us on: Youtube Instagram