Site icon Swatantra Tv

వైసీపీ హయాంలో మద్యం స్కామ్‌ పెద్దది- సీఎం రమేశ్‌

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్‌ స్కామ్‌పై విచారణ జరపాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. మద్యం అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లో సీఎం రమేశ్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో పోలిస్తే జగన్‌ స్కామ్‌ పదిరెట్లు పెద్దదన్నారు.

2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చారని సీఎం రమేశ్‌ చెప్పారు. మద్యాన్ని ప్రైవేటు షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని… ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. ఐదేళ్ల పాటు మద్యం లావా దేవీలు నగదుతోనే జరిగాయన్న సీఎం రమేశ్‌… మద్యం షాపుల సిబ్బందినీ ఒప్పంద పద్ధతిలోనే నియమించారని వివరించారు. రూ.2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కంటే ఏపీలో పదిరెట్లు పెద్ద స్కామ్‌ జరిగిందని సీఎం రమేశ్‌ ఆరోపించారు.

Exit mobile version