27.7 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

సడన్ స్ట్రోక్స్ (గుండెపోట్లు) ఎందువల్ల..?

ఆడుతూ పాడుతూ, చలాకీగా తిరిగే యువత ఉన్నట్టుండి గుండెపోటు(Heart Stroke)తో హఠాత్తుగా మరణిస్తున్నారు. ఫంక్షన్లలో డ్యాన్సులు కడుతూ, ప్రశాంతంగా ఇంట్లో నిద్ర పోయేవాళ్లు, ఆఫీసుల్లో పనిచేసేవాళ్లు ఇలా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. మన రాష్ట్రంలో రోజుకొక సంఘటన ఎదురవుతున్నా దేశం మొత్తమ్మీద చూస్తే వందలమంది ఇలా సడన్ హార్ట్ స్ట్రోక్స్ తో మరణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ గుండెపోట్లపై రకరకాల వదంతులు పట్టుకొస్తున్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ కారణంగానే ఇవి సంభవిస్తున్నాయని చెప్పేవాళ్లు ఎక్కువైపోయారు. అంతేకాదు అందులో కోవాక్జిన్ వేసుకున్నవాళ్లే చనిపోతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్డియాలజిస్టులు ఏమని చెబుతున్నారంటే…

కరోనా వాక్సిన్ వల్ల అనేది శుద్ధ అబద్ధమని తేల్చి చెబుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత లేదా వాక్సిన్ వేసుకున్న మూడు నెలల లోపు ఏమైనా గుండె సంబంధిత పరిణామాలు ఎదురైతే వాక్సిన్ కారణమని చెప్పవచ్చునని అంటున్నారు. ఆ వాక్సిన్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయితే బ్రెయిన్ డెడ్ అవుతుందని, గుండెకు ఇబ్బంది వస్తే హార్ట్ అటాక్ వస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ పోయి సంవత్సరం పైనే అవుతుంది, అంతేకాదు ఆరునెలల నుంచి కరోనా కేసులు కూడా లేవని చెబుతున్నారు. కోవాక్జిన్ అనేది కూడా శుద్ధ తప్పు అని తేల్చి చెబుతున్నారు. మరి అది కాకపోతే సడన్ గా యువతలో గుండెపోట్లకు కారణాలేమిటి? అంటే విభ్రాంతికి గురయ్యే నిజాలు తెలుస్తున్నాయి.

ఇంతకీ నిపుణులు ఏమంటున్నారంటే ‘డ్రగ్స్’ ప్రధాన కారణంగా చెబుతున్నారు. హెరాయిన్, కొకైన్, నల్లమందు, మార్ఫిన్, చరస్, గంజాయి, మారిజువానా, ఎల్ఎస్ డీ లాంటి ప్రధానమైన డ్రగ్స్ అధికమోతాదులో తీసుకోవడం వల్ల గుండెపోట్లు ఎక్కువవుతున్నాయని తేల్చి చెబుతున్నారు. ఇటీవల కాలంలో వీటి వాడకం ఎక్కువైందని చెబుతున్నారు. ఇవి విచ్చలవిడిగా దొరకడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. యువతలో గుండెపోటు సమస్య ఎందుకు ఎక్కువవుతుందనే విషయంలో ఎన్నో కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా హెవీ స్మోకింగ్ ప్రధాన కారణమని అంటున్నారు.

అంతేకాదు ఆల్కాహాల్ అధిక మోతాదులో తీసుకుంటున్నవారికి కూడా గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని తేల్చి చెబుతున్నారు. అలాగే ఆఫీసులో పని ఒత్తిడులు, ఇళ్లల్లో మానసిక ఒత్తిడులు, బయట ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. అంతేకాదు వేళాపాళా లేకుండా భోజనం చేయడం, టైంకి నిద్రపోకపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కారణమవుతాయని అంటున్నారు.

అవగాహన లేకుండా కరోనా వ్యాక్సిన్ అని చెప్పే ప్రచారాలను దయచేసి నమ్మవద్దని, ఇటువంటి వదంతులు ప్రచారం చేయడం వల్ల సోషల్ మీడియాపై విశ్వసనీయత ఇంకా క్షీణిస్తుందని చెబుతున్నారు.

Read Also: విజృంభిస్తున్న Influenza H3N2 వైరస్.. తస్మాత్ జాగ్రత్త..!!

Follow us on:   Youtube   Instagram

Latest Articles

చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్ రిలీజ్

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్