Site icon Swatantra Tv

సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్

    సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ స్పందించారు. తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతుందన్న నమ్మకం తనకే లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల సీఎం అభద్రతాభావంలో ఉన్నారన్నారు. అందుకే తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మాసైపోతారని..వారికి హైటెన్షన్ వైర్‌లా తాను కాపలా ఉన్నానని చెప్పారన్నారు. గతంలో తన వంద రోజుల పాలన ఒక రెఫరెండంలా భావిస్తానని చెప్పి..నేడు తనపై కుట్రలు చేస్తున్నారని అంటున్నారన్నారు. ఇక కేసీఆర్ బీజేపీని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పిన గంటలోనే..ఓ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్‌లోకి వెళ్లారన్నారు.

Exit mobile version