Site icon Swatantra Tv

అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్‌ కాలనీ లో భూకబ్జాదారుల ఆగడాలు

      అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్‌ కాలనీ లో భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ఐదు ఎకరాల స్ధలంలోని ప్లాట్ల హద్దులు చెరిపి ఫెన్సింగ్‌లు వేసారు. స్ధానికుల్ని, ప్లాట్ల యజమానుల్ని భయభ్రాంతులకు గురిచేసారు. దీంతో ప్లాట్ల యజమానులు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. తమ ఐదు ఎకరాల భూముల్ని కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 1987లో తాము భూములను కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. రెవిన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తమ భూముల్ని కబ్జా చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్‌ను కలవనున్నట్లు చెప్పారు ప్లాట్ల యజమానులు.

Exit mobile version