Site icon Swatantra Tv

KTR: చేసింది చాలదా.. మళ్లీ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు- కేటీఆర్

KTR
స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్(Congress) ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమో గానీ ప్రతి ఆరు మాసాలకు ఒకసారి సీఎం(Chief Minister) మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌(Minister Ktr) ఎద్దేవా చేశారు. తాజ్ డెక్కన్ హోటల్‌లో(Taj Deccan Hotel) మంగళవారం  జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(TBF) సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘కొంతమంది గిట్టని వాళ్ళు మేము ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు ఈ తొమ్మిదేళ్లలో కేసిఆర్ ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు. కానీ కేసిఆర్ ప్రజల మనిషి స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుంది. బోర్‌ కొట్టిందని ఎవరైనా ప్రభుత్వం మారాలని కోరుకుంటారా. అభివృద్ధి చేసేవాళ్లు మరికొంత కాలం ఉంటే తప్పేంటి.
తొమ్మిదేళ్లలో మేం అసాధారణ విజయాలు సాధించాం. ఆరున్నర సంవత్సరాల మా పని తీరు, గత 65 ఏళ్ల ప్రభుత్వాల పనితీరు మీరు గమనించారు. మూసీ నది(Moosi River) సుందరీకరణ చేస్తాం అని కాంగ్రెస్ చెప్తోంది. మూసీ నది నాశనం చేసింది కాంగ్రెస్ కాదా?  కాంగ్రెస్‌ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? మళ్లీ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?  కర్ణాటకలో కాంగ్రెస్‌ (Congress) గెలిచిన తర్వాత అక్కడి బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్‌లో(Hyderabad) అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తాం. 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మిస్తాం. ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య కొత్త హైదారాబాద్ నిర్మిస్తాం. తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లో భూముల విలువ గతంలో కంటే 20 శాతం పెరిగింది. గతంలో వ్యవసాయ రంగం కుంటు పడింది. అందుకే ఆనాడు భూముల విలువ లేదు’ అని కేటీఆర్‌(Ktr) తెలిపారు.
Exit mobile version