Site icon Swatantra Tv

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. తెలంగాణ ఏర్పడిన నాడు తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నామని అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు సంబంధించి ERC సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు స్వర్ణయుగంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు.. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రమని తెలిపారు. ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమల పై వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు రూపాయి కూడా పెంచలేదని కేటీఆర్ గుర్తు చేశారు. కరెంటు చార్జీలు పెంచాలి అనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Exit mobile version