నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న కేటీఆర్.. గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదని.. ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరుద్యోల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.