Site icon Swatantra Tv

పోలీసుల తీరుపై డీజీపీని ప్రశ్నిస్తూ కేటీఆర్‌ ఆగ్రహం

రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై డీజీపీని ప్రశ్నిస్తూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్‌. వినరాని భాషలో సాధారణ పౌరుడిని పోలీస్‌ సిబ్బంది దుర్భాషలాడటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు గండి మైసమ్మ ఆలయం సమీపంలో ట్రాఫిక్‌ పోలీసులు ఓ వాహనదారుడిపై చేయిచేసుకుని, దుర్భాషలాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్పందిస్తూ.. ఇది పోలీస్‌ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన భాషనా అని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని సూచించారు.

Exit mobile version