Site icon Swatantra Tv

విశాఖ‌లో కోల్‌క‌తా బంప‌ర్ విక్ట‌రీ.. చిత్తుగా ఓడిన ఢిల్లీ

విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా నిన్న జ‌రిగిన ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫ‌ల‌మైన ఢిల్లీ.. ఏకంగా 106 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చవిచూసింది. కేకేఆర్ నిర్దేశించిన 273 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించ‌డంలో డీసీ బ్యాట‌ర్లు చెతులెత్తేశారు. కెప్టెన్ పంత్ 55, స్ట‌బ్స్ 54 మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌ య్యారు. దీంతో ఢిల్లీ 17.2 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వైభ‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..మిచెల్ స్టార్క్ 2, ర‌సెల్‌, సునీల్ న‌రైన్ త‌లో వికెట్ తీశారు.

ఇక ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పరుగుల మోత మోగుతోంది. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్..ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసింది. సునీల్ న‌రైన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స‌ర్ల సాయంతో 85 ప‌రుగులు చేశాడు. యువ ఆట‌గాడు, భార‌త అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2022 హీరో ర‌ఘువంశీ కూడా బ్యాట్ ఝుళిపిం చాడు. నరైన్ ఊచకోతకు తోడు రఘువంశీ, రస్సెల్, అయ్యర్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్రికెట్ అభిమానులకు ఈ ఐపీఎల్ సీజన్ అసలుసిసలైన కిక్కు ఇస్తోంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక జట్టు స్కోరు బోర్డును పరుగులబెట్టిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల గడ్డలపై బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తు న్నారు. మొన్న హైదరాబాద్, నిన్న కోల్‌కత్తా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

Exit mobile version