Site icon Swatantra Tv

అల్లు అర్జున్‌ కీలక వ్యాఖ్యలు

స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమైతేనే వస్తానని అన్నారు. మనసుకు నచ్చితేనే వస్తా అంటూ కామెంట్స్‌ చేశారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతున్న వేళ అల్లు అర్జున్‌ కామెంట్స్‌పై చర్చ జరుగుతోంది. మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్‌ సుకుమార్‌తో పాటు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాని సుకుమార్‌ భార్య ప్రజెంట్ చేస్తున్నారు. ఆమె ఆహ్వానం మేరకు అల్లు అర్జున్‌ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇష్టమైన వారిపైన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలని అని అల్లు అర్జున్ అన్నారు. అయితే అల్లు అర్జున్‌ సుకుమార్‌ భార్య ఆహ్వానం మేరకు వచ్చిన దాని గురించే మాట్లాడినా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఎన్నికల సమయంలో శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు పలికిన విషయం గురించే మాట్లాడారనే చర్చ జరుగుతోంది.

Exit mobile version