Site icon Swatantra Tv

TSPSC పేపర్ లీక్ స్కాంలో సంచలన విషయాలు

TSPSC పేపర్ లీక్ స్కాంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. TSPSCలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఉద్యోగుల కోసం గాలిస్తున్నారు. వీరు అక్కడ పనిచేస్తూనే గ్రూప్1 ర్యాంకులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో TSPSCలో పనిచేస్తున్న మరో 42 మందికి దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు మరోవైపు ఈ కేసులో తవ్వినకొద్దీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిందితురాలు రేణుక.. కోచింగ్ సెంటర్ నిర్వహకులతో సైతం టచ్‌లో ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. రాజశేఖర్ స్నేహితుడు రమేష్ పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. మరో 42 మందికి బుధవారం దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Exit mobile version