Site icon Swatantra Tv

ఏపీ కెబినెట్ లో కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది. ఇక, పాత విధానంలోనే టెండర్లు పిలిచేప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానించింది. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 21.86 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, 77 లక్షల సర్వే రాళ్ళ పై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 2 వేల 774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ -పోస్ మిషన్ ల కొనుగోలుకు రూ. 11.51 నిధులు విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Exit mobile version