స్వతంత్ర వెబ్ డెస్క్: వరల్డ్ కప్ లో రేపు ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. కాగా రేపు జరగనున్న మ్యాచ్ లో ఇండియా రెండు కీలక మార్పులను చేయనున్నట్లు కాసేపటి క్రితమే జట్టు యాజమాన్యం ప్రకటించింది. బంగ్లాదేశ్ తో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్ కు దూరం కానున్న విషయం తెలిసిందే.. అందుకే ఇతని స్థానంలో వరుసగా నాలుగు మ్యాచ్ లేక్యూ బెంచ్ కు పరిమితం అయిన సూర్య కుమార్ యాదవ్ ను ఆడించనున్నారు. ఇక టీం లో వరుస అవకాశాలు దక్కినా తనదైన ముద్ర వేయని శార్దూల్ ఠాకూర్ పై కూడా టీం యాజమాన్యం వేటు వేయనుంది, ఇతని స్థానంలో మహమ్మద్ శమిని తీసుకురానుంది. వీరిద్దరి రాకతో టీం ఇంకా బలంగా తయారయ్యి రేపు జరగనున్న మ్యాచ్ లో కివీస్ ను చిత్తు చేసి విజయం సాధించాలని కోరుకుందాం.