ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి ఆగస్టు 23 వరకు అనుమతి ఇచ్చింది. కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్‌కు రెండురోజుల గడువు ఇచ్చింది. బెయిల్‌తోపాటు సీబీఐ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అరెస్టుకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న ఇచ్చిన ఆదేశాలను కేజ్రీవాల్ సవాల్ చేశారు.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్టు చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్‌లో ఉన్న సమయంలోనే జూన్ 26న సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. అయితే కేజ్రీవాల్ కి ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను ఇవ్వగా.. సీబీఐ కోర్టులో ఈ నెల 14న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నిరాకరించింది.
కేజ్రీవాల్‌కి ఊరట కలుగుతుందా లేదా అని ఆప్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈకేసులో సరైన సాక్ష్యాలు లేనందున ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు ఇదివరకే బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.