Site icon Swatantra Tv

సీఎం కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) అస్వస్థతకు గురవ్వడంతో గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు.. హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని.. ఆయనకు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడిందని తెలిపారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఎండోస్కోపీ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించామన్నారు. పరీక్షల అనంతరం కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.

అంతకుముందు కేసీఆర్‌(KCR) సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు కూడా కేసీఆర్ తో పాటు  వైద్యపరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో BRS ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడకానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఇవాళ మధ్యాహ్నం ఈడీ విచారణలో ఏం జరిగిందనే దానిపై చర్చించేందుకు ప్రగతిభవన్ లో కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harishrao) కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేసీఆర్, శోభ అస్వస్థతకు గురయ్యారు.

 

 

 

Exit mobile version