Site icon Swatantra Tv

జిల్లాల బాట పట్టిన కేసీఆర్ … వేడెక్కిన రాజకీయం

పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అత్యధిక స్థానాల్లో నెగ్గేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు పోటీపడుతుండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. నేతలంతా తమ ప్రచార హోరుతో ప్రత్యర్థులను ప్రజల్లో ఎండగట్టే పనుల్లో బిజీ అయ్యారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జిల్లాల టూర్‌ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

   భానుడి భగభగకు పచ్చని చేలన్నీ ఎండి బీటలువారుతున్నాయి. సాగు నీరు లేక రైతులు అల్లాడుతున్నారు. దీంతో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. ఇప్పటికే గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించగా ఇప్పుడు రంగంలోకి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పర్యటించి రైతు సమస్యలపై ఆరా తీయనున్నారు. నీటి ఎద్దడి తో ఎండుతున్న పంటలను పరిశీలించి అన్నదాతల్లో ధైర్యం నింపను న్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేసే అవకాశముండటంతో.. కేసీఆర్‌ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికారం కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గులాబీ శిబిరం మొత్తం ఖాళీ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య గులాబీ బాస్‌ జిల్లాల బాట పట్టడం ఉత్కంఠగా మారింది.

        జిల్లాల పర్యటలో భాగంగా కేసీఆర్‌ రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండ లంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఇక ఈ సందర్భం గా కాంగ్రెస్‌, బీజేపీలే టార్గెట్‌గా కేసీఆర్‌ మండిపడే అవకాశ ముంది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి హస్తం, కమలం పార్టీలు. అందులోనూ ముఖ్య నేతలందరినీ తమవైపుకి తిప్పుకుంది కాంగ్రెస్‌. పదేళ్లపాటు కేసీఆర్‌ను అంటిపెట్టుకుని ఉన్న కడియం, కేశవరావు లాంటి వాళ్లు కూడా పార్టీ వీడటంతో గులాబీ నేతలంతా వారి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే కేటీఆర్‌, హరీష్‌రావు ఒంటికాలుపై లేచి తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కేసీఆర్‌ వ్యూహం ఎలా ఉండనుందని ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో ఆయన జిల్లాల బాట పట్టడం రాష్ట్ర రాజకీ యాల్లో మరింత వేడిని రాజేసింది. ఇకపోతే ఇప్పటికే భానుడి ధాటికి ఎండిపోతున్న పంట లను పరిశీలిం చిన గులాబీ నేతలు..రేవంత్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్  తెచ్చిన కరువు అని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. పంటలు ఎండిపో తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్‌ అవుతున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్  నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ వంటి హామీలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గులాబీ బాస్‌ రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది.

Exit mobile version