Site icon Swatantra Tv

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కేసీఆర్‌ భారీ బహిరంగసభ

      చేవెళ్ల నుంచి ఎన్నికల శంఖం పూరించనుంది గులాబీ పార్టీ. నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచా రంపై ఫోకస్‌ పెంచింది. ఇవాళ చేవెళ్ల నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రచారం ప్రారంభించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాంయత్రం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 లక్షలకు పైగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తు న్నాయి.

చేవెళ్ల సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్‌ హాజరుకానున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతోపాటు ప్రజలు దూరం నుంచి సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిం చారు. సభను సక్సెస్‌ చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

చేవెళ్ల బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది. కాంగ్రెస్‌ సభకు ధీటుగా బీఆర్ఎస్‌ చేవెళ్ల మీటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. కేసీఆర్‌ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ బాస్ అధికార పక్షంపై ఎలాంటి బాణాలు సంధిస్తారు.. అనే దానిపై ఆసక్తి నెలకొంది. సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌, రాజకీ య అంశాలపై కేసీఆర్‌ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 16న మెదక్ పార్ల మెంట్ పరిధిలో బీఆర్ఎస్ మీటింగ్‌ ఏర్పాటు చేసింది. అటు ప్రజల్లోకి వెళ్లేందుకు 70 నుంచి 80 నియో జకవర్గాల్లో బస్సు యాత్రకు ప్లాన్‌ చేసింది. మొత్తానికి ప్రచార జోరును పెంచేందుకు బీఆర్ఎస్‌ రెడీ అయ్యింది.

Exit mobile version