Site icon Swatantra Tv

బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి సభకు కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ బడ్జెట్ సమాశాలకు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్‌ రాకపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏం మాట్లాడుతారు? రేవంత్ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్న అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారా? కారా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఓ దశలో కేసీఆర్ పార్లమెంట్‌కు పోటీ చేస్తారని… ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగింది. అయితే ఆయన ఎంపీగా పోటీ చేయకపోవడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ నాయకులు సైతం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని అనేక సార్లు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ హాజరుకాకపోవడంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతుండడంతో అసెంబ్లీలో రేవంత్, కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం, విద్యుత కొనుగోళ్ల అంశాలపై సైతం కేసీఆర్ అసెంబ్లీ నుంచి క్లారిటీ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క కేసీఆర్ హాజరయితే శాసనసభ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది.

Exit mobile version