Site icon Swatantra Tv

కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల లేఖ

 కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల రవింద్ర కుమార్ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా, పోలీసులు ఇంకా అధికార పార్టీ నీడలోనే పని చేస్తున్నారన్నారు. పోలీసులను అస్త్రంగా మార్చుకొని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను వేధించారని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి, వైసీపీ అభ్యర్ధులకు మేలు జరిగాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. బోండా ఉమాపై గెలవలేనని తెలిసి పోలీసులతో వెల్లంపల్లి డ్రామా ఆడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావ రణంలో ఎన్నికలు నిర్వహించాలంటే, ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని లేఖలో వెల్లడించారు.

Exit mobile version