Site icon Swatantra Tv

కాళేశ్వరం ప్రాజెక్టు – బీఆర్ఎస్ అబద్ధాలు

      ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభానికి కాళేశ్వరం కారణమైందని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. కాళేశ్వరం మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు – BRS అబద్ధాలు – కాగ్ వాస్తవాలు పేరిట తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సరైన విచారణ జరిగేంత వరకు ప్రభుత్వం కాళేశ్వరం మీద పైసా కూడా ఖర్చు చేయవద్దని కోదండరాం కోరారు.

      కాళేశ్వరం కుంగుబాటు కు బాధ్యులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. డ్యాం పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు.తెలంగాణకి కాళేశ్వరం వరమా.. శాపమా అర్ధం కావడం లేదన్నారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేసిఆర్ సర్వం తానై కట్టడంతో ప్రాజెక్ట్ కుంగి పోయిందని విమర్శించారు. అప్పుల చక్రవ్యూహంలో తెలంగాణ చిక్కుకుందని చెప్పారు. హైద రాబాద్ వల్లే తెలంగాణ అన్నింటిలో నంబర్ వన్ గా ఉందని చెప్పారు.

Exit mobile version