Site icon Swatantra Tv

కడప కుటుంబ రాజకీయాలు

ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేసవిని మించి కాక రేపుతున్నాయి. మాజీ మంత్రి వివేకానంద హత్య చుట్టూ తిరుగు తున్నాయి. సీఎం జగన్‌, అవినాష్‌రెడ్డి టార్గెట్‌గా తమ తోబుట్టువులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగారు జగన్‌ మేనత్త విమలమ్మ. కుటుంబ పరువు రోడ్డుకీడుస్తు న్నారు. ఇకనైనా నోరు మూసుకోండి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో షర్మిల, విమలమ్మ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

   ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్‌ హీట్‌ సమ్మర్‌ కంటే వేడి పుట్టిస్తోంది. సీఎం జగన్‌ ఓటమే లక్ష్యంగా తోబుట్టువు లిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివేకా హత్యకేసును అస్త్రంగా మార్చుకున్న వైఎస్‌ షర్మిల, సునీత జగన్‌తోపాటు అవినాష్‌ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకాను చంపింది అవినాష్‌రెడ్డినే అని నిప్పులు చెరుగుతున్నారు. చిన్నాన్నను చంపిన హంతకుడికి జగన్‌ ఎంపీ టికెట్ ఇచ్చాడంటూ మాటల దాడికి దిగుతున్నారు. దీంతో కుటుంబ పరువును రోడ్డుకి లాగుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరి, జగన్‌ మేనత్త విమలమ్మ.

   వైఎస్‌ కుటుంబంలో ఆడబిడ్డలైన షర్మిల, సునీతలిద్దరూ వ్యక్తిగతంగా కక్ష్య పెంచుకున్నారని ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు విమలమ్మ. వివేకాను చంపిన హంతకుడు బయట తిరుగుతుంటే అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డి హత్య చేయడం మీరు చూశారా అని సూటిగా ప్రశ్నించారు. ఏ సంబంధం లేని జగన్‌ను కూడా ఇందులోకి లాగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ కుటుంబ సభ్యులెవరూ వారికి సపోర్ట్‌ చేయడం లేదన్న విమలమ్మ. ఇప్పటికైనా ఇద్దరూ నోరు మూసుకోండని హెచ్చరించారు. జగన్‌ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారని ఆరోపించారు విమలమ్మ. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంగా ఉండటం కనిపించడం లేదా అని నిలదీ శారు. ప్రజలపై ప్రేముంటే జగన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తారా అని ఫైర్‌ అయ్యారు.

  ఇక మరోపక్క మేనత్త విమలారెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. మేనత్తకు వయసు మీద పడింది కాబట్టి సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని.. అసలే ఎండకాలం కాబట్టి ఆయనకు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విమలమ్మ కొడుకుకు జగన్ పనులు ఇచ్చారని.. అందుకే జగన్‌ వైపు నుంచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చనిపోయింది తన సొంత అన్న అనే విషయాన్ని కూడా మర్చిపోయారని మండిపడ్డారు. అన్ని ఆధారాలతోనే తాము ఇలా మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. సీబీఐ ఆధారాల ప్రకారం వివేకా హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని నమ్ముతున్నామన్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ఇలా ఫ్యామిలీ రాజకీయం రంజుగా సాగుతోంది. మరి షర్మిల ఆరోపిస్తున్నట్టు అవినాషే హంతకుడా..? లేదంటే షర్మిల, సునీత వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా..? విమలమ్మ చెబుతున్నట్టు బయట తిరుగుతున్న హంతకు లెవరు..? అన్న అంశాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Exit mobile version