Site icon Swatantra Tv

జర్నలిస్టుల నిరసన ప్రభుత్వం, నాయకులు పట్టదా? – కరీంనగర్ జిల్లా జర్నలిస్టు సంఘం

ఇళ్ల స్థలాల కోసం 15 రోజులుగా నిరసన తెలిపినా ప్రభుత్వానికి, నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదని కరీంనగర్ జిల్లా జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషిచేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే తీర్చేందుకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడాన్ని తప్పుపట్టారు. ఇళ్లస్థలాల సాధన కోసం జర్నలిస్టులు 12 రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా దీక్షా స్థలంలో వంటావార్పు చేశారు. స్వయంగా కూరగాయలు తరిగి, వంటలు చేశారు. రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేశారు. న్యాయమైన కోరిక తీర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత విస్తరిస్థామని శ్రీనివాసరావు హెచ్చరించారు.

Exit mobile version