మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 22కి తదుపరి విచారణ వాయిదా వేసింది.